కేకేఆర్ కొత్త కెప్టెన్ గా ఆ కీలక ప్లేయర్..!

-

ఐపీఎల్ 2025  సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా ఆటగాడు అజింక్య రహానే వ్యవహరించనున్నాడు. తాజాగా అధికారికంగా టీమ్ మేనేజ్ మెంట్ రహానే పేరును ప్రకటించింది. అలాగే వైస్ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యర్ ను నియమించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది.

గత ఏడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆ జట్టు కప్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే అతడిని కోల్ కతా రిటెయిన్ చేసుకోలేదు. ఇక రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్ జాయింట్స్ టీమ్ లకు కెప్టెన్ గా వ్యవహరించారు. ఆ అనుభవం కోల్ కతాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ని కేకేఆర్ ఎందుకు వదులుకుందోనని అందరూ ఆశ్చర్యపోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version