కుమారి ఆంటీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా మారుమోగుతుంది.మీది మెుత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అంటూ తెగ వైరల్ అయింది కుమారి ఆంటీ. అయితే ట్రెండింగ్లో ఉన్న కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్కు దెబ్బపడింది. సోషల్ మీడియాలో ఫుడ్ సెంటర్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఆమె వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అవడం, పర్మిషన్ లేదనే కారణాలతో ఫుడ్ సెంటర్ను తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించినట్లు కుమారీ ఆంటీ తెలిపారు.
అయితే, సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి ఆంటీ హోటల్ మూతపడటంతో వైసీపీ, జేఎస్పీ మధ్య ట్వీట్ల వార్ మొదలైంది. తనకు ఆస్తులు లేవని, కేవలం జగనన్న ఇల్లు ఒకటే ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె అన్నారు. ఆ వీడియోను వైసీపీ శ్రేణులు ట్రెండ్ చేశాయి. దీంతో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డితో చెప్పి టీడీపీ హోటల్ మూసి వేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి సమస్యల్లో ఉన్న మహిళను ఆదుకోవడం మాని ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా? అని జనసేన ప్రశ్నించింది.