బస్సు కండక్టర్ మీద దాడి చేసి కాలుతో తన్నిన మహిళ

-

బస్సు కండక్టర్ మీద దాడి చేసి కాలుతో ఓ మహిళ తన్నింది. హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

The woman who attacked and kicked the bus conductor

బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. అయినా ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటించాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇక ఈ సంఘటన పై సజ్జనార్ కూడా స్పందించారు. హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు సజ్జనార్.

https://x.com/TeluguScribe/status/1752505832745619642?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version