కుప్పంలో మరో దారుణం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు భూ దందాకు తెర లేపారు. చంద్రబాబు ఇంటికి సమీపంలోనే జవాన్ భూమి ఆక్రమణకు తెర లేపారు టీడీపీ నేత సుందరప్ప. ఇండియన్ ఆర్మీ జవాన్ బి.ఎన్.ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించాడట టిడిపి నేత సుందరప్ప.

దింతో తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు భూ బాధితుడు ప్రసాద్. తన కుటుంబానికి ఉన్న ఎకరా 20 సెంట్ల భూమిలో 15 సెంట్లు భూమి ఆక్రమించి, రీ సర్వేలో తన భార్య పేరుతో నమోదు చేసుకున్నాడని భూ బాధితుడు ప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ అధికారులు న్యాయం చేసినా తన తండ్రి నారాయణప్పపై సుందరప్ప దాడి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనిపై టీడీపీ కూటమి సర్కార్ ఎలా రాక్ట్స్ అవుతుందో చూడాలి.
కుప్పంలో మరో దారుణం.
సీఎం @ncbn ప్రాతినిధ్యం వహిస్తున్న #Kuppam నియోజకవర్గంలో టీడీపీ నేతలు భూ దందా
చంద్రబాబు ఇంటికి సమీపంలోనే జవాన్ భూమి ఆక్రమణకు తెర లేపిన @JaiTDP నేత సుందరప్ప
ఇండియన్ ఆర్మీ జవాన్ బి.ఎన్.ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించిన టిడిపి నేత సుందరప్ప
న్యాయం చేయాలంటూ… pic.twitter.com/aAPDDZGoPO
— Telugu Feed (@Telugufeedsite) July 6, 2025