ఏపీలో భారీ ఎత్తున జిల్లా కలెక్టర్ల బదిలీలు జరుగుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత… ఏపీలో భారీ ఎత్తున జిల్లా కలెక్టర్ల బదిలీలు జరుగుతున్నాయి. 26 జిల్లాలకు గానూ 13 జిల్లాల కలెక్టర్ల బదిలీ చేసింది చంద్రబాబు సర్కార్.
ఇక అటు ఏపీలో ఏర్పాటైన ఎన్డీయే కూటమి ప్రభుత్వం పాలనలో దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..ఇప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరుగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం సీఎం చంద్రబాబు చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కెబినెట్లో కీలక చర్చ జరపనున్నారని తెలుస్తోంది. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసే అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్‌లో ప్రత్యేక ప్రస్తావన ఉండనుందనితెలుస్తోంది. ఇప్పటికే ఏపీ అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది కొత్త ప్రభుత్వం. రూ. 14 లక్షల కోట్లకు పైగా ఆంధ్ర ప్రదేశ్ కి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది.