గుడ్ న్యూస్.. ఇక నుంచి బ్యాటరీ కార్లకు నో GST

-

కేంద్ర ప్రభుత్వం ఓ తీపి కబురు చెప్పింది. ఇక నుంచి బ్యాటరీ కార్లను జీఎస్టీ నుంచి మినహాయించాలని నిర్ణయించింది.  కేంద్ర ఆర్థికమంత్రి శాఖ నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రయాణికులకు రైల్వేలు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని తీర్మానించింది.

రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ టికెట్లు, ప్రయాణికులు బసచేసే గదులు, విశ్రాంతి గదులు, లగేజీ సేవలు, బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలు వంటి ఈ మినహాయింపులో ఉన్నాయి.  పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని .. ఈ విషయంలో రాష్ట్రాలు ఐక్యం కావాలని సూచించారు. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తర్వాత దిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ.20000 వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలకమండలి సిఫార్సు చేసినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version