ఏపీలో మాజీ మంత్రి విడదల రజిని, ఎంపీ లావు కృష్ణదేవరాయలు మధ్య వివాదం రోజురోజుకు రాజుకుంటోంది. తాజాగా ఆయన విడదల రజిని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. క్రషర్ యజమానులను భయపెట్టిన అంశంలోనే మాజీమంత్రి విడదల రజిని కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ తెలిపారు. రజిని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయడం కాదని.. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్‌పై భారీగా జరిమానా వేయబోయారనేది నిజం కాదా అంటూ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి విద్యాసంస్థలు నడుపుతున్న తాము.. ఏ నాడూ భూములు కావాలని ప్రభుత్వాలను అడిగింది లేదని తెలిపారు. విమర్శలు చేయకుండా ముందు వాస్తవాలు తెలుసుకోవాలి హితవు పలికారు. అధికారం అడ్డం పెట్టుకుని.. నాడు ఐపీఎస్ అధికారులను బెదిరించారని దుయ్యబట్టారు. నిజంగా డబ్బులు తీసుకోకపోయుంటే.. తన వద్దకు వ్యక్తిని ఎందుకు పంపారు అంటూ మాజీ మంత్రి విడదల రజినిని ఎంపీ లావు కృష్ణ దేవరాయలు ప్రశ్నించారు.