టిడిపి అధినేత నారా చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను ఎవరూ నమ్మరని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఆర్డిఏ లో పేదలకు ఇల్లు ఇస్తే అమరావతి కలుషితం అవుతుందంటూ టిడిపి నేతలు మాట్లాడారని దుయ్యబట్టారు. టిడిపి నేతలు పెత్తందారుల పక్షాన నిలబడుతున్నారని విమర్శించారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా సజ్జల స్పందించారు. పార్టీపరంగా అమిత్ షా విమర్శలు చేశారని.. దేశంలో ఏపీ భాగం కాదు అన్నట్టుగా మాట్లాడారని మండిపడ్డారు.
ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్టులు చదివేయడం కాదు అని కామెంట్ చేశారు ఇక వెనుకబడ్డ కులాలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా సీఎం జగన్ చేసి చూపించారని అన్నారు. బలమైన మెజారిటీతో వైసిపి మళ్లీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 175 కి 175 సీట్లు దక్కించుకునేలా అడుగులు వేద్దామన్నారు సజ్జల. మరింత మెరుగైన మెజారిటీతో సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.