Nara Lokesh : ఇవాళ్టి నుంచే లోకేష్ యువగళం మళ్లీ ప్రారంభం

-

Nara Lokesh : టిడిపి నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవాళ తిరిగి ప్రారంభం కానుంది. కాకినాడ జిల్లా యు. కొత్తపల్లి మండలం శీలంవారి పాకల జంక్షన్ నుంచి పాదయాత్ర మొదలుకానుంది. ఇప్పటికే లోకేష్ శీలంవారి పాకల చేరుకున్నారు.

Lokesh Yuvagalam is sta rting again from today

ఈ సందర్భంగా కాకినాడ సెజ్ బాధిత రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం ఒంటిమామిడి కొత్తపాకల వద్ద ఆక్వా రైతులతో సమావేశం అవుతారు. రాత్రికి అక్కడే విడిది చేయనున్నారు. కాగా, తిరుమ‌ల-తిరుప‌తిలో ప్ర‌సాదం కంటే ప‌ర‌మ‌ప‌విత్రంగా భావించే అన్నప్రసాదాన్ని నాసిర‌కంగా పెడుతున్నారని ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌. దాత‌లు ఇస్తు న్న విరాళాలు ఏమ‌వుతున్నాయి? అని ప్రశ్నించారు. నాసిర‌క‌మైన అన్న‌ప్ర‌సాదాలు అందిస్తూ భ‌క్తుల మ‌నో భావాలు గాయ‌ప‌రుస్తూ, ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్న అవినీతి గ‌ద్ద‌ల‌ను ఈ వైసీపీ స‌ర్కారు కాపాడ‌వ‌చ్చు కానీ, ఆ శ్రీవా రు శిక్షించి తీరుతారని హెచ్చరించారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version