చంద్రబాబు ఫొటో మార్ఫింగ్ చేసినందుకు సెక్షన్ 307 కింద కేసు నమోదు..!

-

సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై పోస్ట్ పెట్టి న వ్యక్తి పై నగరంపాలెంలో కేసు నమోదు చేసినట్లు పశ్చిమ డిఎస్పీ జయరాం ప్రసాద్ పేర్కొన్నారు. వెంకటరామిరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం అని తెలిపారు. అయితే ఈ మధ్య ఏపీలో సోషల్ మీడియా పోస్టుల పై పోలీసులు ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని లేదా సీఎంను అవమానించే విధంగా పోస్టులు పెడితే కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే వెంకటరామిరెడ్డి ఫేస్ బుక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోని మార్ఫింగ్ చేసి పెట్టారు.

దాంతో వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డిఎస్పీ తెలిపారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. సోషల్ మీడియాలో వ్యక్తిని భంగపరిచే విధంగా ఫార్వర్డ్ ట్రోలింగ్ చేసిన వారిపై చర్యలు ఉంటాయి అని తెలిపిన డిఎస్పీ వెంకటరామిరెడ్డి పై గతంలో కూడా తాడేపల్లిలో సెక్షన్ 307 కింద కేసు కూడా నమోదు అయ్యింది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version