ఈనెల 13న ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , అతడి సోదరుడి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే పిన్నెల్లిని ఏ1గా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఐపీలోని143, 147, 448, 427, 353, 452, 120బి, తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేయనున్నట్టు సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. వైరల్ అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే వీడియో ఎన్నికల కమిషన్ కు సంబంధం లేదని ప్రకటించిందంటే.. పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తుంది అని ట్వీట్ చేశారు అంబటి. కొత్త ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తుంది మంత్రి అంబటి ట్వీట్.. మాచర్ల నియోజకవర్గ పోలింగ్ బూత్ సీసీ టీవీ పుటేజీ ఆంధ్రా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ వీడియోతో మాకు సంబంధం లేదని ఈసీ ప్రకటించింది. దీనిపై మంత్రి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.