మూడు రాజధానులపై మంత్రి ధర్మాన ఆసక్తికరర వ్యాఖ్యలు

-

మూడు రాజధానులపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు అనేది కేవలం మాట్లాడడానికి మాత్రమేనని.. ప్రధానమైన పరిపాలనా రాజధాని విశాఖనే అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన మన రాజధాని – మన విశాఖ సదస్సులో పాల్గొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానులు అనేది కేవలం మాట్లాడడానికే.. ప్రధానమైన పరిపాలన రాజధాని విశాఖ నే అన్నారు.

ఒడిశా కు రెండు రాజధానులు ఉన్నాయా? కటక్ లో హైకోర్టు ఉంటే.. భువనేశ్వర్ రాజధానిగా ఉందన్నారు. 8 రాష్ట్రాలలో అసెంబ్లీ, హైకోర్టు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వేర్వేరు చోట్ల ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు మంచి రాజధాని అవసరం ఏర్పడిందని తెలిపారు. పదేళ్లు హైదరాబాదులో ఉండొచ్చని విభజన చట్టంలో ఉన్నా.. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి రెండేళ్లకే ఖాళీ చేశారని అన్నారు. పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version