ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ సాయిప్రసాద్ ను ఆ స్థానంలో సీఎం జగన్ పెట్టారని తెలిపారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే కంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని పిలవాలని చెప్పారు. భూమిపై సంపూర్ణ హక్కు అందించడం చాలా అవసరం.
1977లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ వచ్చింది. ఏదైనా సున్నితంగా తిరస్కరించడం తెలియాలని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. ఇప్పుడు అంతా డిజైన్ అయిపోయింది. తప్పు చేయడం అస్సలు కుదరదు అన్నారు. ఉద్యోగ సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి.. పరిస్కరిస్తామన్నారు. ప్రభుత్వానికి ఉన్న కొద్ది కాలంలో చేయాల్సింది అంతా చేశాను అని తెలిపారు. రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. నీతి అయోగ్ ఇచ్చిన మోడల్ ప్రకారం.. టైటిల్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది. 30లక్షల ఎకరాలను ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు మంత్రి ధర్మాన.