నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సమగ్ర విచారణ అనంతరం కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కవిత పై అక్రమాలు, వసూళ్ల ఆరోపణలు వస్తున్నాయి. సొంత సిబ్బంది నుండి సైతం భారీగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
గత15 రోజులుగా కవిత అక్రమాల పై ఫోకస్ పెట్టిన రాష్ట్ర నిఘా విభాగం… రేషన్, గుట్కా మాఫీయా నుంచి అక్రమ వసూళ్లు, కింది స్థాయి సిబ్బంది వద్ద కూడా చేతివాటం ప్రదర్శించినట్టు నిర్దారణకు వచ్చింది. కవిత అక్రమాల్లో ఒక ఎస్ఐ,ముగ్గురు కానిస్టేబుల్లు,ఒక హెడ్ కానిస్టేబుల్ పాలు పంచుకున్నట్లు సమాచారం. కవిత షాడో టీమ్ పైన విచారణ కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అవినీతి బయటపెడతామంటూ కవితను నలుగురు రిపోర్టర్లు బ్లాక్ మెయిలింగ్ చేశారంటూ జిల్లాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.