అనర్హులు కూడా సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారు : కొండపల్లి శ్రీనివాస్

-

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించేలా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అర్హులైన పెన్షన్ల గుర్తించేందుకు మంత్రి వర్గ ఉప సంఘం వేయాలని సీఎం ఆదేశించారు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అయితే కొందరు అనర్హులు కూడా సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వ్యక్తులు రూ. 15 వేల మేర వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారు అని తెలిపారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామిక వేత్తలుగా మార్చాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయం. 10 జిల్లాల్లో ఎస్పీవీలు ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహిస్తాం.

డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న 1000కి పైగా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం రాష్ట్ర వాటాగా రూ.42 కోట్ల విడుదల తద్వారా రూ.512 కోట్లు అందుబాటులోకి వస్తాయి. అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు అని పేర్కొన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version