ఏపీలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు సర్కార్…. అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచింది. ఇక ఇప్పుడు కొత్త పెన్షన్ లపై కీలక అప్డేట్ ఇచ్చింది.
ఇందులో భాగంగానే… కొత్త పింఛన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తాం. ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నాం’ అని అన్నారు.