ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక సాయంత్రం…. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మరో ఫైట్ జరగనుంది.
ఈ మ్యాచ్ చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా… రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆదివారం కావడంతో… ఈ రెండు మ్యాచ్లు చూసేందుకు జనాలు ఎగబడి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగే సన్రైజర్స్ మ్యాచ్ కోసం తెలుగు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.