2027 గోదావరి పుష్కరాలపై మంత్రి నిమ్మల కీలక ప్రకటన !

-

2027 గోదావరి పుష్కరాలపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి ఘాట్ల నిర్మాణం బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందని వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రివ్యూ చేసుకుంటామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. 75% దేవాదాయ శాఖ, 25% బుద్దవరపు ఛారిటీ ద్వారా గోదావరి హారతి నిర్వహిస్తున్నామని తెలిపారు.

Minister Nimmala Ramanaidu made a key announcement on 2027 Godavari Pushkars

గత ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలను కూడా జరగకుండా చేసారని పేర్కొన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.  ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఇసుక వ్యాపారం చేయరాదు.. అమల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇసుక లూటి చేయడంతో గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నాం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version