పవన్ కళ్యాణ్ ఓ సైకో సేనాని అని మంత్రి రోజా నిప్పులు చెరిగారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా 3 రాజధానుల ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆర్కే రోజా.
జనసేన అంటే సైకో సేనలా, రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చురకలు అంటించారు ఆర్కే రోజా. ఇప్పటం గ్రామం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. ఆ ప్రాంతంలో ఏదైనా సంఘటన జరిగితే ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ పర్యటించాల్సింది పోయి పవన్ కల్యాణ్‌ను కరివేపాకులా ముందుకు తోశారన్నారు ఆర్కే రోజా. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పచ్చపత్రికలు, ఛానళ్లు ఎత్తుకు ఎత్తినట్లే ఎత్తి కిందపడేశాయి. దీనిని పవన్‌కల్యాణ్ గుర్తుంచుకోవాలని మండిపడ్డారు.