మంత్రి విడుదల రజనీకి అస్వస్థత

-

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన విడుదల రజిని అస్వస్థతకు గురికావడంతో అక్కడి వైద్య సిబ్బంది ఆమెకు ఓఆర్ఎస్ ఇచ్చారు. అనంతరం కాసేపటి తర్వాత సమావేశాన్ని ముగించుకొని వెంటనే విజయవాడకు బయలుదేరారు మంత్రి విడుదల రజిని.

అయితే బిజీ షెడ్యూల్ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికలలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది విడుదల రజిని. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version