ఎట్టిపరిస్థితుల్లో మీ పిల్లల ముందు ఈ విషయాలని మాట్లాడద్దు.. వారి భవిష్యత్తుకు ప్రమాదం..!

-

చాలామంది పెద్దవాళ్లు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు పెద్ద వాళ్ళు చేసే ఈ తప్పులు వలన పిల్లలు అనవసరంగా బాధ పడాలి. వారి భవిష్యత్తుకే ఇది ప్రమాదం. పెద్దవాళ్లు అసలు పిల్లల ముందు ఈ విషయాలని మాట్లాడకూడదు ఇలాంటి విషయాలు పిల్లలు ముందు మాట్లాడితే వాళ్ళ భవిష్యత్తు కచ్చితంగా దెబ్బతింటుంది. వాళ్లు మంచివాళ్లు కాదు వాళ్ళు ఇలా అలా అని పిల్లలు ముందు అసలు మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే పిల్లలు యొక్క మెదడు పాడవుతుంది. అలానే పిల్లలు ఎవరితోనైనా స్నేహం చేస్తే అలాంటి వ్యక్తితో స్నేహం చేయొద్దు అని చెప్పకూడదు.

వీళ్లు పేదవాళ్లు వీళ్లు డబ్బు లేని వాళ్ళు అని పిల్లలకి అస్సలు చెప్పకూడదు. ఇలా ఉండకూడదు అని చెప్పాలి తప్ప ఇలా చేస్తే నువ్వు బాలేవు అని చెప్పకూడదు. దీనిని మార్చుకోమని సున్నితంగా చెప్పాలి. ఎప్పుడూ కూడా పిల్లల్ని నువ్వు చెడు మాట్లాడతావు అని చెప్పకూడదు ఇలాంటి పదాలు వాడకూడదు అని మాత్రమే తల్లిదండ్రులు చెప్పాలి. అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులు వాళ్లు బాగున్నారు వాళ్ళు బాగా చదువుకుంటున్నారు మరి నువ్వు ఎందుకు చదువుకోవడం లేదు అని ఇతర పిల్లలతో పోల్చి చెప్తారు.

అది పిల్లల్ని కొంగిపోయేలా చేస్తుంది. పిల్లలతో ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు ఆ విధంగా మాట్లాడకూడదు. తల్లిదండ్రులు పిల్లలతో నువ్వు కూడా బాగా చదువుకోవాలి అని చెప్పాలి తప్ప వాళ్లు బాగా చదువుతున్నారు నీకేమైంది అన్నట్లు ప్రశ్నించకూడదు. ఎందుకు నీకు ఎక్కువ మార్కులు రావు అని అస్సలు చెప్పకూడదు. ఇంకా బాగా చదువుకోవాలి అని మాత్రమే తల్లిదండ్రులు పిల్లలతో చెప్పాలి.

పిల్లల్ని ఎప్పుడూ బాధ్యతగా చూసుకోవాలి తప్ప తల్లిదండ్రులు బాధ పెట్టకూడదు. నీకోసం నేను ఎంత ఖర్చు పెడుతున్నానో తెలుసా అని ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో చెప్పకూడదు. ఆర్థిక పరిస్థితుల గురించి పిల్లలతో మాట్లాడకూడదు. ఇతరుల గురించి నెగిటివ్ గా పిల్లల ముందు చెప్పకూడదు. మీ నడవడకని పిల్లలు అనుసరిస్తారు కాబట్టి ముందు మీరు బాగా నడుచుకుంటే పిల్లలు కూడా అదే విధంగా నడుచుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version