మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైలవరం నియోజకవర్గ టీడీపీ కీలక నేతలకు టచ్ లోకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెళ్లారు. పార్టీ అధిష్టానం నుంచి మైలవరంలో తాను పోటీ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వసంత చెబుతున్నట్టు సమాచారం అందుతోంది.

తాను వైసీపీ లో ఉన్నపుడు టీడీపీ నేతలు ఉన్న వారితో ఏమైనా అభిప్రాయ బేధాలు ఉంటే కలిసి మాట్లాడుకుని ఇకపై పని చేద్దామని వసంత చెబుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇవాళ లేదా రేపు నియోజక వర్గంలో టీడీపీ నేతలతో వసంత సమావేశమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమా, బొమ్మ సాని సుబ్బారావు అసమ్మతి చల్లర్చటం పై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు లోకల్ టాక్ నడుస్తోంది.