పోలవరం ప్రాజెక్టుపై మోడీ సర్కార్‌ సీరియస్‌ !

-

పోలవరం ప్రాజెక్టుపై మోడీ సర్కార్‌ సీరియస్‌ అయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీర్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాపర్ డ్యామ్ కొట్టుకుపోతే ఎవరూ బాధ్యులని నిలదీసింది. గైడ్ బండ్ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది.

Modi government is serious about Polavaram project

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం సీరియస్ నెస్ లేదని అర్థం అవుతుందని వ్యాఖ్యానించింది. మరో 15 రోజుల్లో తిరిగి సమావేశం కావాలని, అప్పటికీ నిర్దేశించిన అంశాల్లో కొన్ని పూర్తి చేసుకొని రావాలని ఆదేశించింది. ఢిల్లీలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ, కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ సమావేశం నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version