డబ్బులు ఊరికే రావు..రోడ్డుపైనే టిఫిన్ చేస్తున్న లలిత జ్యువలరీ ఓనర్

-

లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ నెల్లూరు జిల్లాలో ఓ దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.గతంలో మీడియా ప్రపంచంలో లలిత జ్యువెలర్స్ యాడ్ ఓ కొత్త సునామీ సృష్టించింది.ఏ చానల్ చూసినా, ఏ పేపర్ చదివినా, ఎక్కడ చూసినా లలిత జువెలర్స్ యాడ్ ప్రత్యక్షమైంది.ఈ యాడ్ చూడని టీవీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో!లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ వాళ్ళ అమ్మ ఇచ్చిన బంగారంతో చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగారు.పదిహేనేళ్ల వయసులో వాళ్ళ అమ్మ నాలుగు గాజులు ఇచ్చి ఆభరణాల తయారీ కి ప్రోత్సహించింది.

కిరణ్ కుమార్ ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉంటారు.దక్షిణ భారతదేశంలో లలిత జ్యువెలర్స్ కు ప్రస్తుతం చాలా షో రూమ్ లు ఉన్నాయి.1985 లో మొదట చెన్నైలో లలిత జ్యువెలర్స్ షోరూం ప్రారంభించారు.ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ 1999 లో లలిత జ్యువెలర్స్ సంస్థను కిరణ్ కుమార్ టేకోవర్ చేశారు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంలా కిరణ్ కుమార్ నెల్లూరులో దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యాలు ఆశ్చర్య పరిచాయి.అందుకే అంటారేమో ఆయన” డబ్బులు ఊరికే రావు అని”

Read more RELATED
Recommended to you

Exit mobile version