మోపిదేవి: కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం

-

ప్రముఖ క్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.  ఈ తరుణంలోనే.. కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం జరిగింది. మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం గ్రాండ్‌ గా నిర్వహించారు. సుప్రసిద్ధ దేవస్థానంగా భాసిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా చేస్తున్నారు.

Mopidevi Kanulapanduvaga Subrahmanyeshwara Swamy Theppotsavam

గురువారం రాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి పుష్కరిణిలో కళ్యాణమూర్తుల తెప్పోత్సవం నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం జరిగిన తరుణంలో… వేలాది భక్తులు అక్కడి చేరుకుని… దర్శనాలు చేసుకున్నారు.

ఇక అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవ కూడా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు. ఇక ప్రముఖ క్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకుంటే.. సంతానం, పెళ్లిళ్లు, అప్పుల బాధలు పోవడం, కొత్త ఇంటి నిర్మాణం లాంటి కోరికలు తీరుతాయని భక్తులు చెబుతూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version