నేడు కేంద్ర కేబినెట్ సమావేశం…ఆ బిల్లుకు ఆమోదం తెలిపే ఛాన్స్!

-

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. నేడు సాయంత్రం 6 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే క్యాభినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

union cabinet meeting news

కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలావుండగా, కొత్త చట్టంలో దీర్ఘకాల శిక్షలు, నిబంధనలు (షరతులు) లేదా వివరణలు ఉండవని ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. “మీరు వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును చూసినప్పుడు, మీరు చాలా భిన్నమైన బిల్లును చూస్తారు. మేము చట్టాలను వ్రాసే విధానంలో మార్పు వస్తోంది. మీరు తక్కువ పొడవైన వాక్యాలను చూస్తారు మరియు బహుశా నిబంధనలు లేదా వివరణలు ఉండవు” అని PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాండే పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version