ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకంలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధం అయింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ప్రస్తుతం ఒకే పంటకు కొన్ని చోట్ల దిగుబడి, మరికొన్ని చోట్ల వాతావరణం ఆధారంగా బీమా చేస్తోంది. దీంతో ఒకేలా నష్టం వాటిల్లినా పరిహారంలో వ్యత్యాసంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. ఇకపై నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఖరీఫ్లో మిరప, పసుపు, జొన్న పంటలకు దిగుబడి ఆధారంగానే పరిహారం ఇస్తోంది. పత్తి, వేరుశనగ పంటలకు వాతావరణం ఆధారంగా పరిహారం, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడిమామిడి పంటలకూ వాతావరణం ఆధారంగా బీమా ఇస్తోంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఇక తాజాగా వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకంలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధం అయింది కొత్తగా బీమా పరిధిలోకి ఆముదం పంటను తీసుకొచ్చింది. ప్రస్తుత వ్యవసాయ సీజన్ నుంచే వర్తింపు చేయనుంది. పంటలవారీగా నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.