తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 130 ఆలయాలను నిర్మించనున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రూ.37.34కోట్ల కామన్ గుడ్ ఫండ్ నిధులతో ఆలయాలను నిర్మిస్తామన్నారు. సిజిఎఫ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ… స్వరాష్ట్రంలో మొత్తం 2,378 ఆలయాల నిర్మాణానికి సుమారు రూ.598 కోట్లు మంజూరు చేశామని తెలిపారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
ఇప్పటివరకు రూ.225 కోట్లతో పనులు పూర్తి చేశామని చెప్పారు. అటు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. TSSPDCLలో కొత్తగా రిక్రూట్ అయిన 1,362 మంది లైన్ మెన్ లకు నిన్న హైదరాబాదులో నియామక పత్రాలు అందజేస్తారు. తమ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో విద్యుత్ సంస్థల్లో 35,774 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. అదే విద్యుత్ రంగం సాధించిన విజయాలతోటే ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు తెలంగాణా కు తరలి వస్తున్నారన్నారు.