ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. చంద్రబాబు నాయుడును ఉంచిన జైలులోనే మిథున్ రెడ్డిని పెట్టి పగ తీర్చుకుందని టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈ సౌకర్యాలన్నీ కల్పించాలని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సదుపాయాలు
టీవీ
బెడ్
వెస్ట్రన్ కమోడ్
మూడు పూటల ఇంటి భోజనం
మంచం
దోమ తెర
ప్రోటీన్ పౌడర్
రెగ్యులర్ మెడిసిన్
యోగా మ్యాట్
వాకింగ్ షూస్
మినరల్ వాటర్
వార్త పత్రికలు
ఒక పర్యవేక్షకుడు
వారంలో ఐదు రోజులు ఇద్దరు లాయర్లతో ప్రైవసీ సమావేశాలు
నోట్ బుక్స్
పెన్నులు