తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నారంటూ సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అయితే హైకోర్టులో విచారణ జరిగినా.. రఘురామ ఆ కేసును సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ భిన్న వాదనలు వచ్చాయి.
ఎలాంటి కారణాలు లేకుండా ఎంపీని అరెస్ట్ చేయడమే కాకుండా పోలీసులు కొట్టారంటూ సుప్రీం కోర్టు పిటిషన్ లో పేర్కన్నారు ఎంపీ రఘురామ తరఫున లాయర్లు. అయితే ఈ పిటిషన్ పై కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి.
అయితే ఫైనల్గా సుప్రీం కోర్టు.. ఎంపీ రఘురామరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన విడుదాలవుతారని అంతా అనుకున్నారు. అటు బెయిల్ ఆర్డర్స్ ను సీఐడీ కోర్టుకు సమర్పించి, విడుదల చేయాలని లాయర్లు కోరారు. అయితే ఇక్కడే ట్విస్టు నెలకొంది. రఘురామ డిశ్చార్జ్ రిపోర్టు ఇస్తేనే విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు మాత్రం రిపోర్ట్ రావడానికి కనీసం నాలుగు రోజులు పడుతాయని తెలుపుతున్నారు. కావాలంటే అప్పటి వరకు ఆస్పత్రిలోనే ట్రీట్ మెంట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఆయన నాలుగు రోజుల్లోనే విడుదల అవుతారా లేక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.