రాజకీయ విప్లవ శంఖారావం వారాహి అని..జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దామని ప్రకటన చేశారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం…ఏపీలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందేనని ప్రకటించారు.పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగానే వేలాది మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు.పవనుకు ఏపీ సీఎం అనే శక్తిని అందిస్తే ఇంకెంతో ఉపయోగకరమైన సేవలు అందిస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందనీ చెప్పారు.
ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేసి, అభివృద్ధి బాటలు వేయగల సమర్థత గల నాయకుడు పవన్…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు కోసం శంఖారావం మోగించడానికి బయలు దేరుతోంది వారాహి అంటూ పేర్కొన్నారు నాగ బాబు.
వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది.జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన శ్రేణులు సమిష్టిగా, సమాలోచనలతో వారాహి యాత్రను విజయవంతం చేయాలి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులకు సంబంధించి ప్రజల్లో ఆలోచనాత్మకమైన చైతన్యం పెరుగుతోందన్నారు. ప్రజలంతా కలిసి మెలిసి జీవించే వాతావరణాన్ని సృష్టించడమే వారాహి యాత్ర ప్రధాన ధ్యేయం.పవన్ కళ్యాణుకు మద్దతుగా జనసేన జెండా పట్టి వారాహి వెంట అడుగులు వేద్దాం..చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదామని ప్రకటన చేశారు.