సీఎం కేసీఆర్ కుంభ కర్ణుడైతే.. కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు – షర్మిల పోస్ట్

-

సీఎం కేసీఆర్ కుంభ కర్ణుడైతే.. కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు అంటూ షర్మిల పోస్ట్ పెట్టింది. తెలివిలేనోళ్లు కాంగ్రెసోళ్ళయితే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొన్న మీది అతి తెలివి కాదా చిన్న దొర..!కాంగ్రెస్ నేతలు చేతకాని దద్దమ్మలు అయితే 2014 లో 6గురిని కొన్న మీరు పెద్ద దద్దమ్మలు కారా..? అంటూ ఫైర్ అయ్యారు. చేతకాని సన్నాసులే అయితే 2018 లో 12మందిని కొన్నందుకు మీరు పెద్ద సన్నాసులు కారా..? ప్రతిపక్ష లీడర్లు ఎన్నికల సమయంలోనే కనిపించే సంక్రాంతి గంగిరెద్దులైతే…ఎన్నికలకు 6 నెలల ముందు నిద్ర లేచిన కుంభకర్ణుడు కేసీఆర్ అంటూ మండి పడ్డారు.

ఎందుకు మళ్ళీ కేసీఆర్ ను ఆశీర్వదించాలో ఒక్క కారణం చెప్పు చిన్న దొర..?రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. రూ.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసినందుకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలా..?ప్రాజెక్టుల పేరు చెప్పి మీ కుటుంబం లక్ష కోట్లు కాజేసినందుకు ఆశీర్వదించాలా..? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి, 9 ఏళ్లలో 65 వేల ఉద్యోగాలే ఇచ్చినందుకు మళ్ళీ అధికారం ఇవ్వాలా ?మీ పాలనలో నిరుద్యోగం 100 రెట్లు పెరిగి నిరుద్యోగ జాబితాలో,ఆత్మహత్యల్లో నెం.1 ఉన్నందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలా.? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version