హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రారంభించిన రోజా.. నాగబాబు సెటైర్లు

-

జనసేన నేత నాగబాబు మంత్రి రోజాపై మరోసారి సెటైర్లు వేశారు. ‘హంద్రీనీవా సుజల స్రవంతిని రోజా ప్రారంభించారు’ అంటూ ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం ద్వారా, వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చారని, రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందించినట్లు సమాచారం’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తద్వారా హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి కాకపోవడంపై ఆయన సెటైర్ వేశారు. వాస్తవానికి మంత్రి రోజా ప్రారంభించింది తన నియోజకవర్గం పరిధిలో రూ. 11 లక్షలతో నిర్మించిన చిన్నపాటి తాగునీటి పథకాన్ని. ఫిబ్రవరి 7వ తేదీన నిండ్ర మండలంలోని బీజీ కండ్రిక, ఎంసి కండ్రికల్లో నిర్మించిన తాగునీటి బోరు, పైపులైన్లను రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోను ఆమె ట్విట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను మార్ఫింగ్ చేసిన కొందరు ‘వైయస్సార్ పోలవరం’ ను ప్రారంభించిన రోజా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పర్యాటక మంత్రి ట్రోల్ చేశారు. ఆ మార్ఫింగ్ ఫోటోనే తాజాగా నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version