నాలో సగం.. నా ప్రాణం చంద్రబాబు : భువనేశ్వరి

-

నాలో సగం.. నా ప్రాణం చంద్రబాబు అంటూ భువనేశ్వరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాలో సగం, నా ప్రాణం నారా చంద్రబాబునాయుడు అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. చంద్రబాబు చేసిన తొలి సంతకం.. రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి సంకేతం అని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.

Nara Bhuvaneshwari 

కాగా,ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 5 అంశాల అమలు దస్త్రాలపై సంతకాలు చేశారు. లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించేలా.. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసే దస్త్రంపై నమొదటి సంతకం చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు ఫైల్‌పై రెండో సంతకం, లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రత పింఛన్లను రూ.4వేలకు పెంచుతూ లబ్ధిదారుల సమక్షంలో మూడో సంతకం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version