తిరుమల వరుస వివాదాలు…ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న కేంద్ర హోం శాఖ !

-

టీటీడీ పై కేంద్ర హోం శాఖ సమీక్ష కు సంబంధించిన అంశం లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ అధికారులతో హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దు అయింది. ఆ టీటీడీ అధికారులతో సమీక్షా ఆదేశాలను వెనక్కి తీసుకుంది కేంద్ర హోం శాఖ. ఇటీవల టీటీడీ లో చోటు చేసుకున్న తొక్కిసలాట వ్యవహారంలో మొదటిసారి జోక్యం చేసుకుంది కేంద్ర హోం శాఖ.

tirumala

టీటీడీ లో ఇటీవల తొక్కిసలాట నేపథ్యంలో ఈ నెల 20 వ తేదీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలంటూ హోం శాఖ ఆదేశాలు ఇచ్చింది. హోం శాఖ లేఖ పై హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు సీఎం చంద్రబాబు. ఆ లేఖను తక్షణమే విరమించాలంటూ తన శాఖ ఉన్నతాధికారులకు అమిత్ షా ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు హోం అఫైర్స్ కంట్రోల్ రూం ఆఫీసర్ తాజా ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version