టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు అరెస్ట్ ను నిరసిస్తూ.. అక్టోబర్ 02న నారా భువనేశ్వరి నిరహార దీక్ష చేయాలని నిర్ణయించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రాంతంలోనే పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత భవిష్యత్ కార్యచరణను అచ్చెన్నాయుడు ప్రకటించారు.
చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ.. అక్టోబర్ 02న రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్తరీ ఇంట్లో లైట్లు అన్నీ నిలిపివేసి ప్రజలు నిరసన తెలిపాలని కోరారు. లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలన్నారు. టీడీపీ-జనసేన సంయుక్త కార్యచరణ కమిటీ ఏర్పాటు చేయాలని నేటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ జేఏసీ రాష్ట్ర స్థాయిలో ఉంటుందని.. ఇకపై ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలలో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలుంటాయని.. వివరించారు. లోకేష్ పై సంబంధం లేని ఆరోపణలు చేస్తున్నారని.. అసలక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడే కేసు ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. భూ సేకరణ కూడా జరుగలేదని వెల్లడించారు.