తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయవ్వరా ? అంటూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఫైర్ అయ్యారు. తన తల్లి వర్ధంతి కార్యక్రమానికి వెళ్లకుండా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకోవడం దుర్మార్గమని నారా భువనేశ్వరి అన్నారు. ‘టిడిపి నేతలు, కార్యకర్తలపై నిర్బంధం ఆవేదన కలిగిస్తోంది.
కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వ వైఖరి బాధించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు ఎందుకు ఆందోళన చేసేవారో ఇప్పుడు తెలుస్తోంది. ఇదేం చట్టం….ఇదెక్కడి న్యాయం?’ అని భువనేశ్వరి మండిపడ్డారు నారా భువనేశ్వరి.
కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు రేపు విచారించనుంది. విజయవాడ ఏసిబి కోర్టు బెయిల్ నిరాకరించడంతో సిబిఎన్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఆటు బాబు హెల్త్ రిపోర్ట్ పై సిఐడి దాఖలు చేసిన కౌంటర్ పై విజయవాడ ఏసిబి కోర్టు రేపు విచారించనుంది.