World Cup 2023 : డెలివరీ బాయ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు

-

వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయింది. మొన్న ఇంగ్లాండ్ పై ఆఫ్గనిస్తాన్ గెలవగా…. తాజాగా సౌత్ ఆఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. 246 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 207 పరుగులకే ఆల్ అవుట్ అయింది. సఫారీ జట్టులో మిల్లర్ 43, మహారాజ్ 40, రన్స్ చేసి పరవాలేదనిపించగా…. మిగతా ఎవరూ రాణించలేదు. నెదర్లాండ్స్ బౌలర్లలో వ్యాన్ బీక్ 3, మీకే రెన్, వాన్ డేర్ మెర్వ్, లీడే తలో 2, ఆకేర్ మెన్ ఒక వికెట్ తీశారు.

Paul van Meekeren’s Old Tweet As A ‘Uber Eats Delivery Boy’ Resurfaces After Netherlands Beat South Africa

అయితే.. నిన్నటి వరల్డ్ కప్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచి నెదర్లాండ్స్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ టీం బౌలర్ పాల్ వాన్ మీకేరెన్ పేరు నెట్టింట ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకానొక దశలో క్రికెట్ మ్యాచ్లు లేక ఫుడ్ డెలివరీ బాయ్ గా చేసిన పాల్ నిన్న సౌత్ ఆఫ్రికాపై జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బతుకుతెరువు కోసం డెలివరీ బాయ్ గా చేస్తున్నట్లు 2020లో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version