మార్చి నెలలోనే డీఎస్సీ.. లోకేష్ కీలక ప్రకటన !

-

మార్చి నెలలోనే డీఎస్సీ అంటూ మంత్రి నారా లోకేశ్‌ క్లారిటీ ఇచ్చారు. AP DSCపై ఇవాళ మండలిలో మంత్రి నారా లోకేశ్‌ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలోనే DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం తమపై ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా DSC నిర్వహించలేదు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

nara lokesh comments on ap dsc

శాస‌న మండలిలో వైసీపీ ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు.త్వరలోనే తల్లికి వందనం పథకంపై విధివిధానాలు ప్రకటిస్తామని శాసన మండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తల్లికి వందనం పథకానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్ 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందన్నారు. కాగా తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news