ఏపీకి శ్రీలంక పరిస్థితులు..త్వరలోనే ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే : నారా లోకేష్‌ సంచలనం

-

ఏపీ ఆర్ధిక పరిస్థితి శ్రీలంక ఆర్ధిక పరిస్థితితో సమానంగా ఉందని.. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో ఏదో రోజు ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్‌. ఆర్ధిక ఎమర్జెన్సీ వస్తే బ్యాంకుల్లో ఉన్న ప్రజల డబ్బు, బంగారాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని..నాణ్యత లేని మద్యం వల్ల 42 మంది ప్రాణాల పోయాయి.. అందుకే సభలో పోరాడామని చెప్పారు.

మా పోరాటం వల్లే సీఎం నోరు విప్పారని.. నాన్న బుడ్డి వల్లే అమ్మ ఒడి ఇవ్వగలుగుతున్నామని బహిరంగంగా చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ ప్రభుత్వం మద్యం మీదే మనుగడ సాగిస్తోందని సీఎంతోనే చెప్పించడం మేం సాధించిన విజయమని.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో తదుపరి ప్రణాళిక సిద్దం చేసుకుంటామని పేర్కొన్నారు.

ఆ రోజు అమరావతికి మద్దతు పలికి.. ఇవాళ కాదనడం మోసం కాదా..? తమ శాఖ అధికారులు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారని.. ఏ పని కావడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారని గుర్తు చేశారు. అన్ని ఓ చోట ఉన్నప్పుడే పనులు కానప్పుడు.. మూడు వ్యవస్థలు మూడు చోట్ల ఉంటే పనులెలా అవుచాయని.. రాజధానుల వల్లే అభివృద్ధి జరుగుతుందంటే.. 175 నియోజకవర్గాల్లో 175 రాజధానులు పెట్టొచ్చుగా..? అని చురకలు అంటించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారితే ప్రజల పరిస్థితేంటీ..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version