CM జగన్ కు 4 చోట్ల రాజభవనాలు ఉన్నాయని టిడిపి నేత లోకేష్ ఆరోపించారు. పల్నాడు జిల్లా కారంపూడి సభలో మాట్లాడుతూ…’జగన్ రూ. లక్ష విలువైన చెప్పులు వేసుకుంటారు. రూ. 1000 విలువైన వాటర్ బాటిల్ తాగుతూ పేద వాడినని చెబుతారు’ అని మండిపడ్డారు. పుంగనూరు ఘటనలో చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డికి వైసీపీ నేతల దాడులు కనిపించలేదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు హై వోల్టేజ్…. ముట్టుకుంటే షాక్ తప్పదని హెచ్చరించారు.అధికార పక్షం నేతలే బంద్‌కు పిలుపునిచ్చే వింత పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. పూర్వంలో కేరళను పాలించిన కొందరు రాజులు రొమ్ము పన్ను వేశారని, జగన్ అంతకంటే దుర్మార్గమైన పాలకుడు అని అభివర్ణించారు. కేరళ రాజులు విధించిన రొమ్ము పన్ను పేరు ముళకరం అని వెల్లడించారు. నాటి కేరళ రాజులు కూడా జగన్ ముందు దిగదుడుపేనని లోకేశ్ వ్యాఖ్యానించారు.