ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్యన టెస్ట్, వన్ డే మరియు టీ 20 సిరీస్ లు జరగనున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ముగిసిన టెస్ట్ మరియు వన్ డే సిరీస్ లను ఇండియా గెలుచుకుంది. ఇక మిగిలిన 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను గెలుచుకోవడాన్ని తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు టీ 20 లు పూర్తి కాగా, రెండింటినీ వెస్ట్ ఇండీస్ గెలుచుకుని ఇండియాపై పూర్తి ఒత్తిడి ఉంచింది. ఇక మిగిలిన మూడు మ్యాచ్ లను గెలుచుకుంటేనే ఇండియా సిరీస్ గెలవగలదు. కానీ ఆతిధ్య వెస్ట్ ఇండీస్ ఒక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. ఈ రోజు సాయంత్రం జరగనున్న మూడవ టీ 20 లో గెలవడం ఇండియాకు చాలా కీలకం , మరి ఏమీజరగనుంది అన్నది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. కాగా ఈ జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
IND VS WI : ఈ రోజు ఓడితే సిరీస్ గోవిందా ?
-