లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టి.. విపక్షాలపై పైచెయ్యి సాధించాలి: ప్రధాని మోడీ

-

లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టి.. విపక్షాలపై పైచెయ్యి సాధించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మరికాసేపట్లో చర్చ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీలతో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అది ఇండియా కూటమి కాదు, అహంకారుల కూటమి, అహంకారులను ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు క్విట్ ఇండియా అని పేర్కొన్నారు ప్రధాని మోడీ. నిన్న రాజ్యసభలో ఢిల్లీ బిల్లును సెమీ ఫైనల్‌గా విపక్షాలు భావించాయి, విపక్ష కూటమిలోని అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవిశ్వాసం తీసుకొచ్చారు, లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టి మ్యాచ్ నెగ్గినట్టే విపక్షాలపై పైచెయ్యి సాధించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version