ఏపీ విద్యార్థులకు నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. సర్టిఫికెట్లపై కీలక ప్రకటన చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏపీలోని కాలేజీల వద్దే ఉండిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్ల అంశంపై చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే… ఏపీలోని మొత్తం ఎంత మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాల వద్ద ఉన్నాయోనని మంత్రి నారా లోకేష్ ఆరా తీసారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్దే ఉండిపోయాయని అధికారులు తేల్చారు. దీంతో 8 లక్షల మంది బాధిత విద్యార్థులకు వారి సర్టిఫికెట్లు ఒకేసారి ఇప్పించేలా కసరత్తు చేస్తున్నారు నారా లోకేష్. పెండింగులో రూ. 3500 కోట్ల మేర విద్యా దీవెన చెల్లింపులు చేసేందుకు సిద్ధం అయ్యారు. గత ప్రభుత్వం విద్యా దీవెన చెల్లింపులు పెండింగులో పెట్టడంతో సర్టిఫికెట్లను నిలిపేశాయి కాలేజీలు. త్వరలో కాలేజీ యాజమాన్యాలతో సమావేశం కానున్నారు మంత్రి లోకేష్. ఆరు విడతల్లో విద్యా దీవెన బకాయిలు చెల్లించేలా కసరత్తు చేస్తున్నారు.