వైసీపీ ఇచ్చిన 1520 ల్యాప్ టాప్ ల్లో సమస్యలు…అవన్నీ నాసిరకమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. మండలి లో మంత్రి నారాలోకేష్ ఈ కామెంట్స్ చేశారు. వైసీపీ పాలనలో ఐఐఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్ టాప్ ల పంపిణీ చేశారని ఆరోపణలు చేశారు నారా లోకేష్. 1520 ల్యాప్ టాప్ ల్లో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు తేల్చారు నారా లోకేష్.
నాసిరకం ల్యాప్ టాప్ ల సరఫరాపై 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. ఏపీ ఈ-ప్రొక్యూర్ మెంట్ ద్వారా ఆర్జీయూకేటీల్లో అభ్యసించే విద్యార్థులకు అందించేందుకు 2023లో 6,500 ల్యాప్ టాప్ లు కొనుగోలు చేశారని ఆరోపణలు చేశారు నారా లోకేష్. ఒక్కో ల్యాప్ టాప్ కు రూ.27వేలు అన్నారు. ల్యాప్ టాప్ ల్లో కనీసం ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్ కూడా ఇన్ స్టాల్ చేయలేదు. బేసిక్ అడాప్టర్ లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని ఫైర్ అయ్యారు నారా లోకేష్. నాసిరకం ల్యాప్ టాప్ ల పంపిణీపై సమగ్ర దర్యాప్తు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.