కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష రాజకీయాలకు వ్యతిరేకం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నవంబర్ 14 (చిల్డ్రన్స్ డే) సందర్భంగా గాంధీభవన్‌లో నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎప్పుడైనా పోషించిందా? అని ప్రశ్నించారు. ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ వైఫల్యం ఏమిటో కేటీఆర్ చెప్పాలని భట్టి ప్రశ్నించారు. నిరుద్యగులకు ఉద్యోగాలివ్వడం ప్రభుత్వ వైఫల్యమా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడమే వైఫల్యమా? రైతు రుణమాఫీ చేయడం ప్రభుత్వ వైఫల్యమా? ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నించారు. మీ పాలన నచ్చకే ప్రజలు మాకు ఓటేశారు. మీరు అధికారం కోల్పోయి అమాయక ప్రజలను రెచ్చగొడుతారా? ఫైర్ అయ్యారు. ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అని డిప్యూటీ సీఎం విమర్శించారు.