అమెరికాలోనూ వైసీపీ కాల‌కేయుల రాజ్యం – నారా లోకేష్‌

-

ఏపీలోనే కాదు…అమెరికాలోనూ వైసీపీ కాల‌కేయుల రాజ్యం నడుస్తోందని నారా లోకేష్‌ ఫైర్‌ అయ్యారు. వైసీపీ కాల‌కేయుల రాజ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే కాదు, అమెరికాలోనూ దాడులు-దందాలు-కిడ్నాప్‌లు-సైకో చేష్ట‌లు సర్వ‌సాధార‌ణం అయ్యాయని నిప్పులు చెరిగారు.

Nara Lokesh Write a Letter to CM Jagan

వైకాపా అధినేత సైకోయిజంని మించిన సైకో వైకాపా ఎన్ఆర్ఐ స‌త్తారు వెంక‌టేశ్ రెడ్డి అని… హ్యూమ‌న్ ట్రాఫికింగ్, కిడ్నాప్, శాడిస్టులా హింసించ‌డం వంటి నేరాల‌కు పాల్ప‌డుతోన్న వైకాపా ముఠాల ఆట క‌ట్టించాలని పిలుపునిచ్చారు నారా లోకేష్‌. అమెరికాలో వైకాపా సైకోల దుశ్చ‌ర్య‌ల‌ వెనుక ఉన్న పెద్ద సైకో ముఠాని బ‌య‌ట‌కి లాగి శిక్షించాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌.

సైకో జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌నం ర‌క్తం పీల్చుతుంటే, ఆయ‌న అనుచ‌ర పిల్ల సైకోలు అమెరికాలో ఏపీ యువ‌త‌పై శాడిజం చూపిస్తున్నారు. ఏపీకి చెందిన‌ 20 ఏళ్ల కుర్రాడికి బంగారు భవిష్యత్తు ఆశ చూపించి అమెరికా రప్పించి, అక్కడ కూడా తమ అధినేత జగన్ లాగే సైకోయిజం చూపించాడు వైసీపీ నేత‌ సత్తారు వెంకటేష్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version