జ‌గ‌న్ రెడ్డి గారూ! శిశుపాలుడిలా మీ పాపాలు పండిపోయాయి – నారా లోకేష్‌

-

హ‌త్య‌లు, దాడుల‌తో టిడిపి కేడ‌ర్‌ని భ‌య‌పెట్టాల‌నుకుంటున్న జ‌గ‌న్ రెడ్డి గారూ! శిశుపాలుడిలా మీ పాపాలు పండిపోయాయని నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రం కావ‌డంతో, రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం మీరు చేయిస్తోన్న‌ హ‌త్య‌లు, దాడులే మీ ప‌త‌నానికి దారులు. రొంపిచ‌ర్ల మండ‌ల టిడిపి అధ్య‌క్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం ముమ్మాటికీ మీ వైసీపీ గూండాల ప‌నేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాల‌కోటిరెడ్డికి ఏమైనా జ‌రిగితే వైసీపీ స‌ర్కారుదే బాధ్య‌త‌. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భ‌ర్త పాల్గొన్నాడంటే..మీ రౌడీమూక‌లు ఎంత‌గా బ‌రితెగించాయో అర్థం అవుతోంది. ఫ్యాక్ష‌న్‌ మ‌న‌స్త‌త్వం బ్ల‌డ్‌లోనే వున్న మీ పాల‌న‌లో ప‌ల్నాడు ప్రాంతం ర‌క్త‌సిక్త‌మ‌వుతోందని నిప్పులు చెరిగారు లోకేష్‌.

ఇక‌నైనా హ‌త్యారాజ‌కీయాలు, దాడులు ఆపండి. లేదంటే ఇంత‌కి నాలుగింత‌లు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండండి. జ‌గ‌న్‌రెడ్డి అధికారం, పోలీసులు అండ‌గా వున్నార‌ని రెచ్చిపోతున్న వైసీపీ నేత‌లకి ఇదే చివ‌రి హెచ్చ‌రిక‌. మేము తిర‌గ‌బ‌డితే, మీ వెంట వ‌చ్చేది ఎవ‌రు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మ‌ల్ని కాపాడేదెవ‌రు ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version