మెగా డాటర్ కు వయసు అయిపోయింది అంటున్న ట్రోలర్స్.. కారణం..?

-

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి పరిచయం అక్కర్లేదు. ఇకపోతే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితురాలే. నిహారిక ఒక అమ్మాయిగా ఎదుర్కోవాల్సిన అన్ని చీత్కారాలు ఎదుర్కొని తెలుగు పరిశ్రమలో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈమె హీరోయిన్ గా నటించింది కొన్ని సినిమాలైనా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఎక్కువగా హోమ్లీ రో ల్స్ చేస్తూ కుటుంబ ఆడియన్స్ ను సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత వెబ్ సిరీస్ లు, సినిమాలు అంటూ కొంచెం వరకు పేరును సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా పలు వివాదాలతో కొన్ని కొన్ని సార్లు వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటుంది . మొన్నామధ్య తన ప్రమేయం లేకపోయినా సరే హైదరాబాద్ పబ్ లో జరిగిన రేవు పార్టీలో పోలీసులు దాడి చేయడంతో అక్కడ ఈమె దొరకడం ఆ తర్వాత ఈమెపై దారుణంగా నెటిజన్లు ట్రొల్ చేయడం అన్నీ జరిగిపోయాయి.

ఇకపోతే సుమారుగా 8 వారాలు లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్లీ సోషల్ మీడియాకి రీఎంట్రీ ఇచ్చి తెగ రచ్చ చేస్తుంది ఈ ముద్ద గుమ్మ. ఇకపోతే తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పిక్ షేర్ చేయగా దీనిపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే నిహారిక తాజాగా షేర్ చేసిన ఆ ఫోటోలు ఆమె తల కిందకు దించుతూ నవ్వుతున్న ఒక ఫోటోను షేర్ చేసింది . ఇక ఆ ఫోటో చూసిన ఒక నెటిజన్ ముఖం చూపించుకునే ధైర్యం లేదు.. ఏ పిక్ కూడా తల పైకెత్తి చూసింది లేదు అంటూ నిహారిక ఫోటోకు కౌంటర్ పెట్టాడు. ఇక మరొక నెటిజెన్ ఏమో ముగిసిన మన కథకి మళ్లీ కొత్తగా ప్రాణం తీస్తున్నావా? ప్రాణం పోస్తున్నావా? అంటూ కామెంట్ చేయగా.. ఇంకొక నెటిజన్ ముసలావిడలా కనిపిస్తున్నావు అంటూ కామెంట్లు చేశాడు. ఇక ఆ ఫోటో ఈమెకు విపరీతమైన ట్రోల్స్ ని తీసుకొచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు.


 

Read more RELATED
Recommended to you

Exit mobile version