Nara Lokesh to Maha Kumbh Mela with family: ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు మంత్రి నారా లోకేష్. కుటుంబ సమేతంగా మహాకుంభమేళకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ నెల 17వ తేదీన మహాకుంభమేళకు ఏపీ మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు.
త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించబోతున్నారు లోకేష్. కుంభమేళా నుంచి కాశి విశ్వేశ్వరుడి దర్శనానికి కూడా… ఏపీ మంత్రి నారా లోకేష్ వెళ్లబోతున్నట్లు ప్రకటన విడుదలైంది. అయితే చంద్రబాబు కుటుంబం కాకుండా… కేవలం తన కుటుంబాన్ని మాత్రమే మహాకుంభమేళకు తీసుకువెళ్తున్నారు నారా లోకేష్. ఇక ఇప్పటికే మహాకుంభమేళకు చాలామంది రాజకీయ ప్రతినిధులు వెళ్లిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు కూడా తాజగా మహా కుంభమేళకు వెళ్లడం జరిగింది.